నేడు జగనన్న రాక | - | Sakshi
Sakshi News home page

నేడు జగనన్న రాక

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకాకుళం పర్యటనకు జిల్లా మీదుగా వెళ్తున్నారని, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్మించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తు న్నారని తెలిపారు. విశాఖ విమానాశ్రయం నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్న జగన్‌కు రాజపులోవ కూడలి నుంచి కందివలస గెడ్డ వరకు ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఘనంగా స్వాగతం

పలుకుదాం

పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు

మజ్జి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement