కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో ఓటు కనిపించని వారితో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం 17 ఏళ్లు నిండిన యువతీయువకులు కూడా ఓటు హక్కు కోసం ముందస్తు దరఖాస్తు చేసుకునే సదుపాయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే సదరు దరఖాస్తు దారు ముందస్తు దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతనే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ప్రస్తుతం సచివాలయాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉన్నారు. అర్హత ఉండి ఓటు లేని ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి.
– రామ్మోహనరావు, ఆర్డీవో, బొబ్బిలి


