సీ్త్రలు శక్తి చూపాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

సీ్త్రలు శక్తి చూపాల్సిందే..

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

బస్సు ఎక్కాలంటే..

చిత్రాలు చూశారా.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మంగళవారం బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. శక్తినంతా కూడగడితే తప్ప బస్సు ఎక్కలేని పరిస్థితి. విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణ కోసం విజయనగరం నుంచి వెళ్లేందుకు అరకొర ఆర్టీసీ సర్వీసులు ఉండడంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. ఆర్టీసీ డిపోలు, రోడ్లపైనే బస్సు ఎక్కేందుకు పోటీపడ్డారు. తోపులాటల్లో కొందరు కిందపడి గాయపడ్డారు. మరికొందరు ఫుట్‌బోర్డులపై ప్రమాదకర ప్రయాణాలు సాగించారు. వృద్ధులు, చిన్నారులు బస్సులు ఎక్కలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. అరకొర బస్సులు నడుపుతూ సీ్త్రశక్తి పథకం అమలు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుండడంపై మండిపడ్డారు. ఇంతటి ప్రయాణ కష్టాలు ఎన్నడూ చూడలేదని, బస్సుల్లో ప్రయాణం మరిచిపోవాల్సిందేనంటూ పలువురు పురుష ప్రయాణికులు నిట్టూర్చారు.

– సాక్షిఫొటోగ్రాఫర్‌, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement