విజయనగరం రూరల్: గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఆవిష్కరణలు, పరిశోధన, ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం–ఏపీ, ఐకార్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్) వ్యూహాత్మక భాగస్వామ్యంపై మంగళవారం చర్చించామని సీటీయూఏపీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ టి.శ్రీనివాసన్ తెలిపారు. ఈ సందర్భంగా వృక్ష శాస్త్ర విభాగధిపతి డాక్టర్ అనిరుధ్‌కుమార్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎం.సుందరంతో హైదరాబాద్‌లో వీసీ భేటీ అయ్యారు. గిరిజన యువతలో నైపుణ్యాలు, వ్యవసాయ ఆధారిత వ్యవస్థాపకత పెంపొందించడం, అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్, గిరిజన ఉత్పత్తులకు విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం, వాతా వరణ అనుకూల వ్యవసాయ విధానాలతో పాటు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయ నిర్వహణ, పరిశోధన, నాయకత్వం తదితర రంగాల్లో సంయుక్త శిక్షణపై చర్చించామని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను బలోపే తం చేయాలని ఇరు సంస్థలు ఆకాంక్షించినట్లు ఇన్‌చార్జి వీసీ తెలిపారు.


