అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

సమాచార శాఖ మంత్రి కొలుసు

పార్థసారథి

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వివిధ శాఖల అధికారులంతా పరస్పరం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారథి ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై, మంత్రులు డోలా శ్రీ బాలాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌లతో కలిసి భోగాపురం ఎయిర్‌పోర్టు అడ్మినిస్ట్రేషన్‌ భవనంలో మంత్రి పార్ధసారథి మంగళవారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ప్రధాని పర్యటన కార్యక్రమం నోడల్‌ అధికారి ఎంటి కృష్ణబాబు, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌ రాజా, లోకం నాగమాధవి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, పలువురు కూటమి నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement