మెరకముడిదాం: మండలంలోకి ఆదివారం సాయంత్రం ప్రవేశించిన ఏనుగుల గుంపు సోమవారం సాయంత్రానికి ఎం.రావివలస మీదుగా రామాయవలస, గొల్ల లమర్రివలస గ్రామాల మధ్యలో ఉన్న మామిడితోటలోకి ప్రవేశించినట్లు ఎలిఫెంట్ ట్రాకర్స్ సాయి, చంటి, ఉపేంద్ర, నాగ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు సులోచనారాణి ఏనుగుల గుంపు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. రామాయవలస, గొల్లలమర్రివలస ప్రజలను అప్రమత్తం చేశారు.
● సోమలింగాపురం గ్రామానికి చెందిన ఎస్.కిరణ్‌రాజుకి చెందిన ఎకరా 50 సెంట్లు విస్తీర్ణంలోని కొబ్బరితోటను ఽఏనుగులు ద్వంసం చేశాయి.


