ఠిబ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ150 శ్రీ270 శ్రీ280
చికెన్
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు అలసత్వం తగదని, అర్జీదారుల సమస్యల మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ కె.హేమలత, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతితో కలిసి 74 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 21 రెవెన్యూకు సంబంధించిన అర్జీలు రాగా, 53 ఇతర అర్జీలున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ అర్జీలను మూసివేయరాదన్నారు. పరిష్కారం పూర్తయినట్లు పోర్టల్‌లో నమోదు చేసేముందు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారుతో మాట్లాడి నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. అసంపూర్ణ నివేదికలిస్తే కఠిన చర్యలు తప్పవని, పెండింగ్ ఫిర్యాదులకు గడువు విధించి వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
చట్ట పరిధిలో సత్వర న్యాయం: ఎస్పీ
పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్ట పరిధిలో సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, మహిళలపై వేధింపులు, అధిక వడ్డీలు తదితర సమస్యలపై ఈ వేదికలో మొత్తం 7 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను నిర్ధారించుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యల నివేదికలను ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 33 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌శంకరన్ సమావేశ మందిరంలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు గిరిజనులు వివిధ సమస్యలపై 33 వినతులు సమర్పించారు. పవర్ వీడర్ ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సింగడు అర్జీ ఇచ్చారు. హౌసింగ్ పెండింగ్ బిల్లు చెల్లించాలని బగందరకు చెందిన పద్మావి విన్నవించారు. హౌసింగ్ మంజూరు చేయాలని బత్తిలి గ్రామస్తుడు కె.వెంకటరావు తదితరులు కోరారు. కొండపోడు పట్టాలు కావాలని సత్యజగన్నాథపురం గ్రామస్తురాలు కృష్ణవేణి కోరారు. మొగదారగూడలో సీసీ రోడ్డు నిర్మించాలని సవర చిరంజీవి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి


