విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అశ వేధింపులు తాళలేక సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ అంబులెన్సు నిర్వాకుడు, ఇద్దరు మీడియా ప్రతినిధులు కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నారు. సోమవారం కూడా వారు మరింతగా వేధించడంతో ఇంటిలో లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. దీంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. ప్రస్తుతం ఆశ స్టెప్‌డౌన్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఔట్ పోస్టు పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు.
శ్రీకాకుళం రూరల్: బొల్లినేని మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నేతృత్వంలో ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ గివింగ్ అసిస్టెంట్, వెల్నెస్ థెరపిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసై 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు డిప్లమో, బీఎస్సీ, ఎంఎల్‌టీ, బీపీటీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలకు 7995013422, 7680945357 నంబర్లను సంప్రదించాలని కోరారు.
పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి
● ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య డిమాండ్
విజయనగరం అర్బన్: జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోందని అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రవాణా ఖాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కేదారశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబుకు ఫిర్యాదు సమర్పించారు. రాయపూర్ నేషనల్ హైవే, గొట్లాం, పూసపాటిరేగ, పెదమానాపురం, అలమండ, రాజాం ప్రాంతాల నుంచి కంటైనర్లు, వ్యాన్‌లలో ఆవులు, దూడలు, గేదెలను రాత్రింబవళ్లు కబేళాలకు తరలిస్తున్నారని ఫిర్యాదులో తెలియజేశారు. ఫిర్యాదు అందజేసిన వారిలో జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, రేణుక పట్నాయక్, గేదెల నారాయణమ్మ, దమయంతి తదితరులు ఉన్నారు.
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం
విజయ
నగరం క్రైమ్: అలమండ రైల్వేయార్డ్ దిగువ ఉన్న రైల్వే ట్రాక్‌పై ఎలక్ట్రికల్ పోల్ వద్ద గుర్తు తెలియని మృతదేహాం పడి ఉండడాన్ని విజయనగరం జీఆర్పీ సిబ్బంది సోమవారం కనుగొన్నారు. మృతుని వయస్సు సుమారు 35నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని జీఆర్పీ హెచ్.సీ అశోక్ తెలిపారు. మృతుడు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామనఛాయ రంగులో చింపిరి గెడ్డం కలిగి ఉన్నాడని, శరీరంపై బిస్కెట్ రంగు లోయర్, స్లీల్ లెస్ రౌండ్ నెక్ నలుపు రంగు గల బనియన్ దానిపై బుల్స్ 23 అను ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయన్నారు. మెడలో తెలుపు ఆకు పచ్చ ఎరుపు రంగు గల దారంతో ఉన్న తాడు ధరించి ఉన్నాడని మృతదేహాన్ని గుర్తించిన గలిగిన వారు ఫోన్ 6301365605, 9192475 85742 నంబర్లకు తెలియజేయాలని హెచ్‌సీ అశోక్ కోరారు.


