పూసపాటిరేగ: దేశప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 1న జిల్లాకు విచ్చేస్తున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతీయరహదారిని ఎయిర్‌పోర్టు రహదారికి అనుసంధానం చేయాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశప్రధాని జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయరహదారిని ఎయిర్‌పోర్టు రహదారికి మూడు చోట్ల అనుసంధానం చేయాలన్నారు. ఈ మేరకు ఎస్పీ దామోదర్ సోమవారం నేషనల్ హైవే అథారిటీ అఽధికారులు, పోలీసు అఽఽధికారులతో కలిసి రాజాపులోవ జంక్షన్ నుంచి రావివలస జంక్షన్ వరకు జాతీయ రహదారిపై పర్యటించి పలుచోట్ల పరిశీలించారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, ఆనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల నుంచి సుమారు 5వేల బస్సులు, ముఖ్య వ్యక్తులు, ప్రముఖులకు సంబంధించి మరో 5వేల కార్లు, పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి 16పై మూడు చోట్ల ఐరన్‌సేఫ్ గార్డులు తొలగించి ఎయిర్‌పోర్టు రహదారికి అనుసంధానం చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసు అఽధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


