రాజాం సిటీ: అన్న చేతిలో తమ్ముడు మృతిచెందిన ఘటనకు సంబంధించి అన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర వె ల్లడించారు. ఈ నెల 22న రేగిడి మండలం సరసనాపల్లి గ్రామానికి చెందిన గొడే కృష్ణ, అతని పెద్దన్నయ్య గొడే అప్పడు మద్యం మ త్తులో భూమి వాటాల గురించి గొడవపడ్డా రు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అప్ప డు తన తమ్ముడైన కృష్ణను చెక్కతో తలపై, నుదురుపై ఇష్టానుసారం కొట్టాడు. దీంతో సంఘటనా స్థలంలోనే కృష్ణ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేగిడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అప్పడును సోమవారం బూరాడ జంక్షన్ వద్ద అరెస్టు చేశామని సీఐ వెల్లడించారు. సమావేశంలో రేగిడి ఎస్సై బాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు.


