విజయనగరం అర్బన్: రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకల కవాతు దళంలో పాల్గొనేందుకు జిల్లా స్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఎంపిక పోటీలను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి మొత్తం 25 మంది విద్యార్ధులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఎంపికై న విద్యార్థుల నుంచి రాష్ట్రస్థాయి పరేడ్‌కు ఇద్దరు స్కౌట్స్, ఇద్దరు గైడ్స్‌ను తుది ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికై న విద్యార్థుల్లో స్కౌట్స్ విభాగం: పి.జగన్‌కుమార్, పి.కిరణ్, ఎన్.హేమంత్‌కుమార్, జి.హరీష్, కె.అఖిల్ ఉన్నారు. గైడ్స్ విభాగం: పి.ప్రియాంక, ఎల్.ఉషశ్రీ, బి.వాణి, వి.హర్షిత, ఎన్.దేవయాని ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు, జిల్లా కమిషనర్ ఈపు విజయ్‌కుమార్, ప్రతినిధులు చోడవరం నారాయణమూర్తి, వేమలి త్రినాథనాయుడు, ప్రవీణ్‌కుమార్, రవికుమార్, సూర్యనారాయణ, పుష్పలత, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.


