శాకాంబరి అలంకరణలో శ్రీ కనకమహాలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

శాకాంబరి అలంకరణలో శ్రీ కనకమహాలక్ష్మి

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

శాకాంబరి అలంకరణలో శ్రీ కనకమహాలక్ష్మి పైడితల్లి అమ్మవారికి రూ.14 లక్షల వెండి చీర వరుణుడి కరుణ కోసం కప్పల పండుగ చెరువులో జలకాలాడిన ఏనుగులు

చీపురుపల్లి: పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు ఆదివారం దర్శనమిచ్చారు. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు.

విజయనగరం టౌన్‌: స్థానిక కంటోన్మెంట్‌ బొగ్గులదిబ్బ ప్రాంతంలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి మూలవిరాట్‌కు అదే ప్రాంతానికి చెందిన భక్తుడు, వ్యాపారవేత్త రెయ్యిశంకర్‌ రెడ్డి, అనంతలక్ష్మి దంపతులు రూ.14 లక్షల విలువైన ఐదున్నర కిలోల వెండి చీరను కానుకగా ఆదివారం సమర్పించారు. ఆషాడ మా సంలో ఏటా మూడురోజుల పాటు అమ్మవారి పండగను భక్తులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పైడితల్లి అమ్మవారికి ఆదివారం వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలతో, వేదమంత్రా ల నడుమ అమ్మవారికి వెండిచీరను సమర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్‌ బోనెల ధనలక్ష్మి, కొట్యాడ రాము, ఈశు, గిరి, అనిల్‌, రుజుతా రెడ్డితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బొండపల్లి: వరుణుడి కటాక్షం కోసం రైతులు, చిన్నారులు బొండపల్లి మండలంలోని గిట్టుపల్లి గ్రామంలో ఆదివారం కప్పల పండుగను నిర్వహించారు. కప్పల పండుగ చేస్తే తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం గ్రామాల్లోని రైతులకు ఉండడంతో చిన్నారులు, పెద్దలు కలిసి గ్రామంలో కప్పలను పసుపుబట్టల్లో కట్టి ఇంటింటికీ తీసుకువెళ్లి స్నానాలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిసి పంటలు సాగు చేయడానికి అవకాశం కల్పించి ముందుకు నడిపించాలని గ్రామంలోని చిన్నా పెద్దా పండుగను నిర్వహించి, పూజలు చేశారు.

మెరకముడిదాం: మండలంలోని ఉత్తరావల్లి పంచాయతీ మధుర గ్రామాలైన గొల్లవెంకయ్యపేట, గదబపేట గ్రామాల మధ్యలో ఆది వారం సాయంత్రం ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది. ఈ గుంపు రెండు గ్రామాల మధ్యలో ఉన్న చెరువులో కాసేపు సేద దీరాయి. అనంత రం అటు శ్యామాయవలస గ్రామం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా శ్యామాయవలస గ్రామస్తులు అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో ఈ ఏనుగులు గుంపు మళ్లీ గొల్లవెంకయ్యపేట, గదబపేట గ్రామాల మధ్యలో ఉన్న మామిడితోటలోకి తరలిపోయాయి. గొల్లవెంకయ్యపే ట, గదబపేట గ్రామాలకు ఫారెస్ట్‌ బీట్‌ అధికా రి గణేష్‌ సిబ్బంది తిరుపతిరావు వెళ్లి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైస్‌ ఎంపీ పీ తలచట్ల హరిబాబు రెండు గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ గ్రామస్తులెవరూ బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement