ఈ నగరాలకు ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

ఈ నగరాలకు ఏమైంది?

Jul 27 2026 2:12 AM | Updated on Jul 27 2026 2:12 AM

ఈ నగరాలకు ఏమైంది?

నార సంచుల వినియోగమే పర్యావరణానికి మేలు

సింగిల్‌–యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తగ్గించుకోవాలి. ప్లాస్టిక్‌కు బదులు నార సంచులు, గుడ్డ సంచులు, జూట్‌ ఉత్పత్తులు, కాగితపు సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలి. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, నిల్వ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నివారించాలి. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రజలు, వ్యాపారులు కలిసి పనిచేయాలి. ప్లాస్టిక్‌కు మనమే దూరంగా ఉంటేనే భావితరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించగలం.

సరిత, కాలుష్య నియంత్రణ మండలి,

ఈఈ, విజయనగరం

విజయనగరం గంటస్తంభం: ఓ వైపు ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు..ఫలితంగా మరో వైపు పర్యావరణానికి ముప్పు. కేంద్ర ప్రభుత్వం సింగిల్‌–యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించి నాలుగేళ్లు దాటుతున్నా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం ఆ నిబంధనలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, థర్మాకోల్‌ వస్తువుల వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఫలితంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఇవి పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.

అవగాహనతో ఆగిపోయిన ప్రచారం

గతంలో విజయనగరం నగర పాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల, ఎస్‌.కోట నగర పంచాయతీలు ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. వ్యాపారులకు సూచనలు జారీ చేశాయి. కొంతకాలం తనిఖీలు కూడా చేపట్టాయి. అయితే ఆ తర్వాత ఆ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో కొనసాగకపోవడంతో ప్లాస్టిక్‌ వినియోగం మళ్లీ పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తనీఖిలు..జరిమానాలు

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 2025–26లో 196 తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.2.92 లక్షల జరిమానా విధించారు. 3 టన్నుల నిషేధిత సింగిల్‌–యూజ్‌ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని విశాఖపట్నంలోని జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌కు తరలించి నిర్వీర్యం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

మార్కెట్లలో యథేచ్ఛగా వినియోగం

కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, పండ్ల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీ పాయింట్ల, టీ దుకాణాల్లో ఇప్పటికీ ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం అధికంగానే కొనసాగుతోంది. వస్తువులు కొనుగోలు చేసే వినియోగాదారులకు కూడా వ్యాపారాలు ప్లాస్టిక్‌ కవర్లనే అందిస్తున్నారు. కాటన్‌ సంచులు వెంట తీసుకెళ్లే అలవాటు ప్రజల్లో పూర్తిగా పెరగకపోవడంతో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గడం లేదు.

కానరాని ప్లాస్టిక్‌ నిషేధం అమలు

ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సింగిల్‌–యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం

నివేదికల్లో తనిఖీలు..క్షేత్రస్థాయిలో పాలిథిన్‌ కవర్ల హవా

పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement