రచ్చ గెలిచి.. ఇంట ఓడి..! | - | Sakshi
Sakshi News home page

రచ్చ గెలిచి.. ఇంట ఓడి..!

Jul 27 2026 2:12 AM | Updated on Jul 27 2026 2:12 AM

రచ్చ గెలిచి.. ఇంట ఓడి..!

బొబ్బిలి: ఇంటిపేరు కస్తూరి వారు. ఇంటినిండా గబ్బిలాల కంపు అన్న చందంగా ఉంది బొబ్బిలి వీణల కేంద్రం పరిస్థితి. బొబ్బిలి వీణల కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతే కాదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ సైతం ఇక్కడి జ్ఙాపికలు, బహుమతుల వీణలు, తయారీ విధానానికి అబ్బురపడ్డారు. ఇక్కడి కార్మికులను వైట్‌ హౌస్‌కు ఆహ్వానించారు. ఇక్కడి తయారీ దారులు దేశ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గుర్తింపు పొందారు. వీణల కేంద్రంలో ఎన్నో వీణలు తయారయ్యాయి. కానీ ఇక్కడి వీణల కేంద్రం మాత్రం అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది.

కేంద్రం చుట్టూ తుప్పలు, డొంకలు

బొబ్బిలి వీణల కేంద్రం ఆవరణ, ప్రహరీ లోపల తుప్పలు, డొంకలతో నిండి ఉంది. ఏటా ఇవి పెరుగుతున్నా చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు. వాస్తవానికి వీణల కేంద్రం ఏటా దాదాపు రూ.40వేలు పన్నుల రూపేణా మున్సిపాలిటీకి చెల్లిస్తోంది. అయినా మున్సిపల్‌ కార్మికులతో ఇక్కడ పరిశుభ్రం చేయించేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. ఫలితంగా ఆవరణ అంతా నాగుపాములు, జెర్రిపోతులు, ఉల్లి పాములు తిరుగుతూ కళాకారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సుమారు 38 మంది కళాకారులు ఉన్న వీణల కేంద్రం వద్ద వారు మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా చుట్టూ పొదలు దర్శనమిస్తున్నాయి.

చీకట్లోనే కేంద్రం

ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వీణల కేంద్రానికి వెళ్లాలంటే చీకటి తప్పదు. ఇక్కడి కేంద్రం బోర్డు వద్ద వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కళాకారులు కోరినా మున్సిపల్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదు. అంతే కాదు వీణల కేంద్రానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు వెలిసిపోయి తుప్పుపట్టింది. కానీ పట్టించుకునే నాథుడే లేడు. కేంద్రం వద్ద బోర్డు లేక పోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వీణల కొనుగోలు కోసం వచ్చిన ఔత్సాహికులు కేంద్రం ఎక్కడుందని స్థానికులను అడగాల్సి వస్తోంది. తుప్పలు తొలగించి వీణల కేంద్రం వద్ద లైట్లు వేసి కేంద్రానికి మునుపటి శోభ తీసుకురావాలని వీణల కేంద్రం కళాకారులు, స్థానికులు కోరుతున్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు..

స్థానికంగా పారిశుధ్య లోపంతో కంపు..

తుప్పలు తొలగించకపోవడంతో

పాములు, కీటకాల బెడద

ఇదీ బొబ్బిలి వీణల కేంద్రం దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement