గర్భగుడి నుంచి గ్రీన్‌ పిచ్‌ వరకు.. | - | Sakshi
Sakshi News home page

గర్భగుడి నుంచి గ్రీన్‌ పిచ్‌ వరకు..

Jul 27 2026 2:12 AM | Updated on Jul 27 2026 2:12 AM

గర్భగుడి నుంచి గ్రీన్‌ పిచ్‌ వరకు..

ఘనంగా ప్రారంభమైన బ్రాహ్మణ క్రికెట్‌ టోర్నమెంట్‌

టోర్నమెంట్‌లో పాల్గొన్న ఎనిమిది టీమ్‌లు

విజయనగరం టౌన్‌: నిత్యం వేదమంత్రోచ్ఛారణలతో ధార్మిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపే ఆ చేతులు ఆనందంతో కాసేపు ఉల్లాసంగా.. ఉత్సాహంగా బ్యాట్‌, బంతి పట్టుకుని ఆనందపడ్డాయి. ఆదివారం స్థానిక రాజీవ్‌ క్రీడామైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న బ్రాహ్మణ క్రికెట్‌ టోర్నమెంట్‌ను జిల్లా క్రీడాశాఖాధికారి వెంకటేశ్వరరావు దంపతులు ప్రారంభించారు. జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు టీవీ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటి రోజు టోర్నీలో ఎనిమిది టీమ్‌లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వరరావు దంపతులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు భమిడిపాటి రామ్‌కుమార్‌ శర్మ, గౌరవాధ్యక్షుడు ఈఆర్‌.సోమ యాజులు, అల్లంరాజు సూర్యరాజేశ్వరశర్మ, పప్పు సరోజిని, భమిడిపాటి జోగేష్‌ శర్మ, రామాయణం సత్యనారాయణ శర్మ, కాశీభట్ల పవన్‌కుమార్‌ శర్మ, సంగీసపు మోహన్‌శర్మ, నూతి సుబ్రహ్మణ్యం, బొడ్డపాటి కామేశ్వరశర్మ, నౌడూరి మణికుమార్‌ శర్మ, చెంబోలు సూర్యనారాయణ శర్మ, జయంతి సత్యనారాయణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement