అల్లూరి త్యాగం.. చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అల్లూరి త్యాగం.. చిరస్మరణీయం

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

పూసపాటిరేగ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తెల్లదొరలను ఎదిరించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు భోగాపురం ఎయిర్‌పోర్టుకు పెట్టడంతో ఆయన త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌.రాంసుందరరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారన్నారు. 13 వేల మంది బాలికలతో ప్రత్యేక థింసా నృత్య ప్రదర్సనతో ప్రధానమంత్రికి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బీచ్‌ కారిడార్‌కు రూ.8వేల కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైందన్నారు. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల నుంచి 5 వేలు బస్సులతో భారీ జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. జీఎంఆర్‌ సంస్థకు 69 మెట్రోబస్‌లు కేటాయించామన్నారు. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయిలో భోగాపురం ఎయిర్‌పోర్టు సేవలు అందుతాయన్నారు. ఎయిర్‌పోర్టు పనులు రూ.4,592 కోట్లతో పూర్తిచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌తో పాటు ప్రజాప్రతినిధిలు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర పుటల్లో సువర్ణాక్షరాలతో

లిఖించే చరిత్ర

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి 5వేల బస్సులతో జన సమీకరణ

కళాకారులతో ప్రధానికి స్వాగత ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement