నీట్‌ లీకేజీపై నిరసన | - | Sakshi
Sakshi News home page

నీట్‌ లీకేజీపై నిరసన

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

నేడు విద్యాసంస్థల బంద్‌కు

ఐక్య విద్యార్థి సంఘాల పిలుపు

విజయనగరం గంటస్తంభం: నీట్‌ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఐక్య విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు,యువత, తల్లిదండ్రులు, అధ్యాపకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ కావడం విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్మనమని విమర్శించారు. కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై వేగవంతమైన, కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుమన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రాము, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, డీవైఎఫ్‌ఐ నాయకుడు రవి, శిరీష,చరణ్‌, గణేష్‌, సూరిబాబు, గౌరీశంకర్‌, దుర్గాప్రసాద్‌, సోమేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement