uu
వీడని జంఝాటం
కొమరాడ: ఒడిశాతో ఉన్న వివాదంతో జంఝావతి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు జంఝాటం తప్పడం లేదు. వైఎస్సార్ హయాంలో ఆస్ట్రియా టెక్నాలజీతో నిర్మించిన రబ్బర్ డ్యాం వల్ల 12వేల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, మక్కువ, సీతానగరం మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో మరో 12వేల ఏకరాలకు సాగునీరు అందని పరిస్థితి. రెండుచోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం రైతులకు శాపంగా మారింది.


