విజయనగరం రూరల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణను నిరసిస్తూ దస్తావేజు లేఖరులు చేపట్టిన సమ్మె బుధవారం కొనసాగింది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మెచేస్తున్న దస్తావేజు లేఖరులు.. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని పేర్కొన్నారు.
24న ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘మెగా పేరెంట్–టీచర్స్ మీట్’ను ఈ నెల 24న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి అభ్యసన సా మర్థ్యాలు, ప్రోగ్రెస్ కార్డులు, హాజరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై తల్లిదండ్రులకు సమగ్ర వివరాలు అందిస్తారు. పిల్లల చదువు, మార్కులు, హాజరును ఎప్పటి కప్పుడు ఫోన్‌లోనే తెలుసుకునే ‘లీప్’ యాప్ వినియోగంపై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజె క్టులు, కళా ఖండాలు, బోధన సామగ్రి (టీఎల్‌ఎం), సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఐటీఐలలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: జిల్లాలోని 3 ప్రభుత్వ, 25 ప్రైవేటు ఐటీఐలలో రెండవ విడత ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ‘ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఐటీఐ’ వెబ్‌సైట్‌లో ఆగస్టు 3వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత లభించే ‘యునిక్ నంబర్’తో ఆగస్టు 4న సాయంత్రం 6 గంటలలోపు దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు ఐటీఐకి వెళ్లి ఒరిజనల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. ఆగస్టు 6న ప్రభుత్వ ఐటీఐలు, 8న ప్రైవేటు ఐటీఐలు ప్రవేశ కౌన్సెలింగ్ నిర్వహిస్తాయని తెలిపారు. డ్రెస్ మేకింగ్, వెల్డర్, ప్లంబర్ ట్రేడ్‌లకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, మిగిలిన అన్ని ట్రేడ్‌లకు 10వ తరగతి విద్యార్హతగా ప్రకటించారు.


