సాలూరు: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాములమ్మ అధ్యక్షతన, ఎంపీడీఓ పార్వతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. సమావేశానికి పలుశాఖల అధికారులు గైర్హాజరయ్యారు.మండలంలో నకిలీ ఎరువులు అధికమయ్యాయని దీనిపై అధికారులు దృష్టిసారించి, చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. నాణ్యమైన ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఇళ్లపై నుంచి కరెంట్ వైర్లు వెళ్తున్నాయని దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికంగా పలు సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


