విజయనగరం అర్బన్: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అఽధికారి యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ‘అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్’ ప్రధాన అంశంగా ఈ పోటీలను మూడు స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాసరచన పోటీ: అంశం ‘అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్: ఎ గేట్‌వే టు గ్రోత్ అండ్ గ్లోబల్ ఆపర్‌ుట్యనిటీస్’, వక్తృత్వ పోటీ (ఎలక్యూషన్): అంశం ‘అల్లూరి సీతారామ రాజు ఎయిర్‌పోర్ట్: జ్యూవెల్ ఆఫ్ ఉత్తరాంధ్ర’, చిత్రలేఖనం (పెయింటింగ్): అంశం ‘అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్’, ట్యాగ్‌లైన్ (స్లోగన్) పోటీ: అంశం: అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌పై ఒక వాక్యంలో ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్ రాయడం.
పోటీల నిర్వహణ విధానం
అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో ముందుగా పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపిన విద్యార్ధులను మండల స్థాయికి ఎంపిక చేస్తారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారికి మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహిస్తారు. మండలస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు జిల్లా కేంద్రమైన విజయనగరంలో తుది పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. విమానాశ్రయం ద్వారా లభించే అభివృద్ది అవకాశాలపై స్థానిక యువతకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చొరవ తీసుకుని విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనేలా చూడాలని డీఓఓ కోరారు.
డీఈఓ యూ.మాణిక్యంనాయుడు వెల్లడి


