విజయనగరం అర్బన్: భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే ఈ విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంలో భాగంగా అందరినీ ఆకట్టుకునేలా ‘స్లోగన్’ పోటీని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. తెలుగులో ఉత్తమమైన స్లోగన్‌ను రూపొందించి పంపిన విజేతకు రూ.లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పోటీ నిబంధనలు ఇలా ఉన్నాయి. 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు. స్లోగన్ సృజనాత్మకంగా సంక్షిప్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విమానాశ్రయం చూపే ప్రభావం, ఆశయాలు, దాని ప్రత్యేకత, గొప్పదనాన్ని ప్రతిబింబించేలా స్లోగన్ శైలి ఉండాలి. విద్యార్థులు తాము తయారు చేసిన స్లోగన్‌తోపాటు తమ పేరు, చదువు, చిరునామా, సెల్‌ఫోన్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా జతపరచాలి. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ‘ఎయిర్‌పోర్ట్‌స్లోగన్.జీమెయిల్.కాం’కి కానీ వాట్సాప్ నంబర్ ‘9440749687’కు కానీ పంపాలి. వివిధ దశల్లో ప్రభుత్వ పరిశీలన అనంతరం అత్యంత ఉత్తమంగా ఎంపికై న ఒక్క స్లోగన్‌కు మాత్రమే నగదు బహుమతి అందజేస్తారు. ఒక వేళ ఏ స్లోగన్ ఎంపిక కాకపోతే ఎటువంటి బహుమతులు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ పోటీలో పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి


