రాష్ట్రంలో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. రెండేళ్ల కూటమి పాలనలో నిత్యం ఏదో ప్రాంతంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గుంటూరులో ఇంటి ముందు బోరు తవ్వించుకునేందుకు స్థానిక సచివాలయ కార్యదర్శి 10వేల లంచం ఇవ్వలేదని ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం దారుణం. ఇంట్లో ఉండే మహిళలకు సైతం రక్షణ లేకుండా పోతోంది. అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతి, అరాచకాలు, అఘాయిత్యాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. ఎమ్మెల్యే అరవఽశ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన అకృత్యాలపై ఎందుకు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు పొట్టకూటికోసం కాకుండా ఇళ్లలోని మహిళల మానప్రాణాలకు కాపాడుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలకు భద్రత కల్పించలేని చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి. రాష్ట్రానికి పట్టిన చెడు గ్రహణం త్వరలో వీడిపోవాలి.
– కోలగట్ల శ్రావణి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయనగరం


