ఆల్‌ ఇంగ్లాండ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ విజేత మనోడే.. | - | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇంగ్లాండ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ విజేత మనోడే..

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

–8లో

–8లో

విజయనగరం: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌ నగరంలో ఈ నెల 17 నుంచి జరుగుతున్న ఆల్‌ ఇంగ్లాండ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ి షప్‌ (అండర్‌ – 19) పోటీల్లో విజయనగరానికి చెందిన భట్రాజు సాయి నచికేత్‌ బంగారు పతకం సాధించాడు. ఆల్‌ ఇంగ్లాండ్‌ జూనియర్‌ బాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. ఆరేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్‌ ఆటపై ఆసక్తిని పెంచుకొని తొలి కోచ్‌ భాస్కరబాబు వద్ద మెలకువలు నేర్చుకున్న నచికేత్‌ ప్రస్తుతం ప్రఖ్యాత చేతన్‌ఆనంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. నచికేత్‌ తల్లి నాగమణి విజయనగరంలోని పీఎస్‌ఆర్‌ కాలనీ ప్రాంతానికి చెందినవారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. నచికేత్‌ ఇప్పటికే మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, స్వీడన్‌, బల్గేరియా దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు సాధించాడు. 2025 ఆగస్టులో శ్రీలంకలో జరిగిన జూనియర్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌లో పాల్గొని తృతీయ బహుమతి సాధించాడు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలో నచికేత్‌ ప్రస్తుతం 12వ ర్యాంకులో ఉన్నాడు.

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌లో 56వ ర్యాంకులో ఉన్నాడు. నచికేత్‌ సోదరుడు సాయి హృషికేత్‌ కూడా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడే. ఆయన కూడా చేతన్‌ ఆనంద్‌ అకాడమీలోనే శిక్షణ పొందుతున్నాడు. నచికేత్‌ తల్లి నాగమణి సీనియర్‌ వాలీబాల్‌ క్రీడాకారిణి. ఆమె విజయనగరంలో వాలీబాల్‌ క్రీడపై మక్కువ పెంచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆంధ్ర యూనివర్సిటీ మహిళా వాలీబాల్‌ టీంకు నాయకత్వం వహించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జట్టులో పాల్గొని ప్రతిభ చూపించారు. నచికేత్‌ను వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి టివి.భగవాన్‌ దాస్‌, ప్రతినిధులు కృష్ణంరాజు, కెవిఎన్‌.రాజు తదితరులు అభినందించారు.

జూనియర్‌

చాంపియన్‌గా నిలిచిన సాయి నచికేత్‌

తొలి భారతీయుడుగా ఖ్యాతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement