ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

మంత్రులు అనిత, కొండపల్లి

పూసపాటిరేగ: ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన మంత్రులు ఏర్పాట్లును పరిశీలించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లుపై అంశాలు వారి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్న వీఐపీలు, ప్రజలు అధికంగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ముందుగా మంత్రులు ప్రధాని పర్యటించే ప్రాంతం, టెర్మినల్‌ భవనం, బహిరంగ సభా స్థలం, పార్కింగ్‌, అప్రోచ్‌ రోడ్లు, అల్లూరి ఐలాండ్‌, ట్రంపెడ్‌ బ్రిడ్జి నిర్మాణం తదితర ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన మ్యాపులును పరిశీలించి పలు సూచనలు చేశారు. వీరి వెంట ఎమ్మెల్యే నాగమాధవి, మార్క్‌ఫెడ్‌ చైర్మెన్‌ బంగార్రాజు, జేసీ సేతుమాధవన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement