స్వామినాయుడువలసలో సినిమా షూటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

స్వామినాయుడువలసలో సినిమా షూటింగ్‌

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

కొమరాడ: మండలంలోని స్వామినాయుడువలస గ్రామ పరిసరాల్లో మేరంగి జంక్షన్‌ ఇద్ద సినిమా బృందం ఆదివారం సందడి చేసింది. శ్రీకాకుళానికి చెందిన హాస్య నటుడు షకలక శంకర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కీలక సన్నివేశాలను గ్రామ పరిసరాల్లో చిత్రీకరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ ప్రేమికులతో పాటు గ్రామస్తులు షూటింగ్‌ వద్దకు వెళ్లి ఆనందించారు.

గాయపడిన మహిళను

ఆస్పత్రికి తరలించిన ఎస్పీ

విజయనగరం క్రైమ్‌: తన కళ్లముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడిన మహిళను ఎస్పీ దామోదర్‌ దగ్గరుండి హాస్పిటల్‌కు తరలించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతా చర్యలను సమీక్షించిన అనంతరం ఎస్పీ దామోదర్‌ విజయనగరం వస్తున్న సమయంలో భోగాపురం మండలం, లింగాలవలస జంక్షన్‌ వద్ద బైక్‌ ప్రమాదం జరిగింది. ఆ బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడినట్లు ఎస్పీ గుర్తించారు. దీంతో తన కాన్వాయ్‌ను ఆపి గాయపడిన మహిళకు తన ఎస్కార్ట్‌ సిబ్బందితో సపర్యలు చేయించారు. బాధితురాలికి ధైర్యం చెప్పి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ను రప్పించి గాయపడిన మహిళను స్థానికుల సహాయంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. భోగాపురం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ కు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.

వ్యక్తి ఆత్మహత్య

బతుకు తెరువుకు భామిని వచ్చిన

కర్ణాటక వాసి

భామిని: బతుకుతెరువులో భాగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి భామిని మండల కేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుని బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకకు చెందిన వలసకూలీ రమేష్‌ కోల్కర్‌(37) మండల పరిధిలో సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసే పనికోసం భార్య లక్ష్మితో ఇక్కడికి వచ్చాడు. స్థానికంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న కోల్కర్‌ రోజులాగానే శనివారం మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రాత్రి కుటుంటసభ్యులు నిద్రపోయిన క్రమంలో తన ఇంటి బాత్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ విషయం గమనించిన భార్య, సహచరులు, చుట్టుపక్కల వారు బత్తిలి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదుతో ఈ ఘటనపై ఏఎస్సై కాంతారావు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement