లారీ ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఒకరి మృతి

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

మరొకరికి గాయాలు

దత్తిరాజేరు: మండలంలోని ఎస్‌.బూర్జవలస పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కె. కొత్తవలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆరికతోట నుంచి స్వగ్రామానికి వస్తుండగా బూర్జవలస పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో బేత త్రినాథ్‌(38)అక్కడికక్కేడే మృతిచెందాడు. మరో వ్యక్తి నల్ల చిట్టినాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాల పాలైన వ్యక్తిని 108లో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించి త్రినాథ్‌ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆస్పత్రికి పంపించారు. మృతుడికి భార్య ఇందు ఎనిమిదేళ్ల ప్రవీణ్‌, ఏడేళ్ల బాలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.

బాలికపై లైంగికదాడి

నిందితుడిపై పోక్సోకేసు నమోదు

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటనలో బాలుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేసామని ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. బాధిత బాలిక నుంచి వివరాలను నమోదు చేయడంతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై సీఐ జి.శంకరరావు కేసు దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement