లారీ ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి మృతి

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

లారీ ఢీకొని యువకుడి మృతి

గజపతినగరం రూరల్‌: మండలంలోని మరుపల్లి 26వ నంబర్‌ జాతీయ రహదారి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన ఇప్పిలి శ్రీనివాస్‌ (38) స్వగ్రామం నుంచి బైక్‌పై వైజాగ్‌ వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న ఐరన్‌ లోడ్‌ లారీ మరుపల్లి జాతీయ రహదారి దగ్గరకు వచ్చేసరికి బలంగా ఢీకొంది. దీంతో బైక్‌ పై వెళ్తున్న శ్రీనివాస్‌ శరీర భాగాలు నుజ్జునుజ్జు కాగా అక్కడికక్కడే తుది శ్వాస విడిచాడు. శ్రీనివాస్‌కు భార్య, 6 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజపతినగరం ఎస్సై కె.కిరణ్‌ కుమార్‌ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్‌ మతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement