విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

సోమవారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2026 పెరిగిన నిమ్మ దిగుబడి జజ్జనకరి జనారే..! ఉపాధికి వీడ్కోలు..! ●ఎంఆర్‌పీకి మించి విక్రయాలు ●రెండేళ్లలో 1520 కేసులు ●చర్యలు తప్పవు సంపద సృష్టి మద్యం అమ్మకాలతో.. ఊరూరా బెల్టు దుకాణాలు

న్యూస్‌రీల్‌

జిల్లాలో ఏటా రూ.1500 కోట్ల అమ్మకాలు ఊరూరా బెల్టు దుకాణాలు ఎంఆర్‌పీకి మించి విక్రయాలతో కూటమి నేతలకూ సంపద నేతల ఒత్తిడితో తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్న అధికారులు

సోమవారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2026

మన్యంలో ఈ ఏడాది నిమ్మ దిగుబడులు బాగా పెరిగాయి. గిరిజన రైతులు ఇప్పుడిప్పుడే

మార్కెట్‌లోకి నిమ్మకాయలను తెచ్చి

విక్రయిస్తున్నారు. 8లో

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉదయించిన జానపద గళం కాళ్లకు గజ్జెలు కట్టి జజ్జనకరి జనారే అంటూ శ్రోతలను ఓలలాడిస్తోంది.

8లో

ఉన్న చోటే పనులు కల్పించాలన్న సదుద్దేశంతో 2006లో అప్పటి కాంగ్రెస్‌ హయాంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని

అమలులోకి తెచ్చింది. 8లో

జిల్లాలో ఎస్‌.కోట, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, తదితర నియోజకవర్గాల్లో కూటమి నేతల కనుసన్నల్లో ఎంఆర్‌పీకి మించి మద్యం విక్రయాలు జరుగుతున్నా.. అబ్కారీ శాఖ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు భయపడి అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు, బెల్టు దుకా ణాలు, సమయపాలన పాటించకపోవడం, అక్రమ మద్యం సరఫరా కేసులు రెండేళ్లలో 1520 నమోదయ్యాయి. వాస్తవానికి చాలా చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అటువైపు చూడడం లేదన్న విమర్శలు లేకపోలేదు.

జిల్లాలో ఎంఆర్‌పీ ధరలకు మించి మద్యం అమ్మకాలు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. ఎక్కడైనా ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్టు దుకాణాలను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తాం.

– బి.శ్రీనాధుడు, ఎకై ్సజ్‌ సూపరిండెండెంట్‌

విజయనగరం జిల్లాలో లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు ఎన్ని ఉంటే అంతకు పదింతలు బెల్టు దుకాణాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచే మద్యం అందుబాటులో ఉందంటే మద్యం సరఫరా ఏ స్థాయిలో జరుగుతుందోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతోనే మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

విజయనగరం రూరల్‌:

తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చుదిద్దుతామని ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఊరూరా మద్యం అమ్మకాలు పెంచి సంపద సృష్టిస్తుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తే, చంద్రబాబు సర్కారు తెలుగు తమ్ముళ్ల సంపద పెంచడానికి మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేసేసింది. దీంతో ఊరూరా మద్యం దుకాణాలకు పోటీగా బెల్టు దుకాణాలు వెలసి తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉండేలా చేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు, వారి నేతల కనుసన్నల్లో జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఎంఆర్‌పీకి మించి మద్యం అమ్మకాలు చేపట్టి రూ.కోట్ల సంపద పోగేసుకుంటున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏటా రూ.1500 కోట్ల పైమాటే..

జిల్లాలో ఏ– 4 లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు 169 ఉండగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు 31 ఉన్నాయి. 2024లో చంద్రబాబు సర్కారు నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ లైసెన్స్‌లు జారీ చేసింది. ఆ ఏడాది 17 లక్షల 45 వేల 215 ఐఎంఎల్‌ కేసులు, 6 లక్షల 33 వేల 709 బీరు కేసుల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.1568.17 కోట్లు ఆదాయం చేకూరింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి 18 లక్షల 36 వేల 156 ఐఎంఎల్‌ కేసులు, 9 లక్షల 35 వేల 838 బీరు కేసుల అమ్మకాల ద్వారా రూ.1475.75 కోట్లు ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో(ఏప్రిల్‌, మే)నే రూ. 261.69 కోట్లు ఆదాయం లభించింది. రెండేళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లు అతి చిన్న జిల్లా అయిన విజయనగరం నుంచే రూ.3305 కోట్లకు పైగా ఆదాయంతో సంపద సృష్టించారని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement