ఎరువు.. ధరవు..! | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. ధరవు..!

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

ఎరువు.. ధరవు..!

భారీగా పెరిగిన

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

ఖరీఫ్‌ సాగుపై ప్రభావం

వ్యవసాయ యంత్ర పరికరాలపై

పెరిగిన భారం

అదనపు ఖర్చులతో అప్పుల్లో అన్నదాత

కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు..

ధరలను నియంత్రించాలి

అన్నదాతకు సాగు కష్టంగా మారుతోంది. సాగునే నమ్ముకొని

ఉన్న ఊరిలో ప్రశాంతంగా జీవిద్దామని రైతు భావిస్తుంటే

ఆ దిశగా అడుగులు వేయనీయకుండా ప్రభుత్వమే

నిలువరిస్తోంది. ఇదేంటో... అందరికీ అన్నం పెట్టే అన్నదాత

విషయంలో ప్రభుత్వ తీరు విమర్శలకు తావిస్తోంది.

ఓ వైపు సకాలంలో విత్తు, ఎరువులు దొరక్క బాధపడే

పరిస్థితులుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ

చందాన మరోవైపు ఎరువుల ధరలు, సాగు యంత్రాల

ధరలు అమాంతం పెంచేస్తున్నారు. వీటిని

నియంత్రించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీసం

ఆలోచించడం లేదని అన్నదాత ఆవేదన

చెందుతున్నాడు. ఈ పరిస్థితులు సాగుపై

తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి.

నెల్లిమర్ల రూరల్‌:

టా ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఎరువుల కంపెనీలు ధరల మోత మోగిస్తున్నాయి. ఒక బస్తాపై సుమారు రూ.200 నుంచి రూ.450 వరకు అదనంగా ధరలు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటల సాగు భారమై పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులు ఎలా బతకాలంటూ కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్‌ సీజన్‌ మొదలై ఈ సారి పంటల ఎలా సాగు చేయాలనే విచారంలో రైతులు ఉన్నారు. అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల్లో యుద్ధం నేపథ్యంలో ఎరువుల తయారీ, ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని, అందుచేత ఎరువుల ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతుంటే, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ఎరువుల ధరల్లో నియంత్రణ లేకుండా పోతోందని రైతులు చెబుతున్నారు. ధరలు పెరిగినంత వేగంగా, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంటలు వేయాలా.. లేదా అనే పరిస్థితికి వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కొక్క కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై రూ.200 నుంచి రూ.450 వరకూ ధర పెరిగింది.

వ్యవసాయ యంత్రాలపై అదనపు ఖర్చు

అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సాగును మరింత భారంగా మార్చా యి. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగించే 90 శాతం యంత్రాలు డీజిల్‌తోనే నడుస్తున్నాయి. దుక్కి దున్నే ట్రాక్టర్‌ మొదలు పంట నూర్పిడి యంత్రాలు, ఎరువులు, పంటల రవాణాకు వినియోగించుకునే ఆటోలు, ట్రాక్టర్లకు డీజిల్‌ కావాల్సిందే. ఈ పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ట్రాక్టర్ల అద్దె, విత్తనాలు, ఎరువుల రవాణా ఖర్చు లు, కోత యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది ఎలినినో భయం కూడా వెంటాడుతోంది. ఏరువాకకు అంతా సిద్ధమవుతుండ గా, వర్షాలు తక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతను కలవర పెడుతు న్నాయి. వర్షాధార పంటలైన పత్తి, మొక్కజొన్న, వరి సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది.

వివిధ కారణాలు చూపి స్తూ ఎరువుల ధరలను ఏడాదికి రెండుసార్లు ఆయా కంపెనీల యాజ మాన్యాలు పెంచుకుంటూ పోతున్నాయి. స్పందించాల్సిన ప్రభుత్వాలు కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. మరోవైపు ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు భారీగా రైతుల నుంచి అదనంగా వసూలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూరి యా, డీఏపీ అంగట్లో కనిపించడం గగనమైంది. యూరియాను అధిక ధరలతో బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది. ఎంఆర్‌పీకే విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– కిల్లంపల్లి రామారావు,

వ్యవసాయ కార్మిక సంఘ నేత

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఎరువుల ధరలను నియంత్రించి సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం విపరీతంగా సాగు ఖర్చులు పెరిగిపోయాయి. పెరిగిన డీజిల్‌ ధరల కార ణంగా యంత్రాలతో వ్యవసాయ పనులు చేయాలంటే కష్టంగా మారుతోంది. అవసరమై న కాంప్లెక్స్‌ ఎరువులు ధరలు తగ్గించే ఏర్పాట్లు చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారు.

– చందక బలరాం, రైతు, సతివాడ గ్రామం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement