విజయనగరం ఫోర్ట్: పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి పేర్కొ న్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కణపాక యూత్ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లో ఆయన చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. జిల్లాలో 1,99,386 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. జిల్లాలో పోలియో చుక్కలు వేయడానికి 1180 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమాన్ని 128 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మత్య్సకార గ్రామా లు, కొండ ప్రాంతాలు, హైరిస్క్ ఏరియాల్లోని పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 66 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఐఓ డాక్టర్ అచ్చుతకుమారి, డీఎస్‌ఓ డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
చీపురుపల్లి : జనసేన పార్టీలో సొంత కేడర్‌కే జరిగిన మోసం ఉదంతం పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కింది. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ తన వద్ద రూ.12 లక్షలు కాజేశారని జనసేన పార్టీకి చెందిన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వినిపై అదే పార్టీకి చెందిన జిల్లా ప్రచార కో–ఆర్డినేటర్ కోట్ల కృష్ణ చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి ఫిర్యాదును ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుకు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని తనకు ఇప్పిస్తానని 2025 జూన్ 15న తన నుంచి రూ.10లక్షల నగదు, రూ.2లక్షల చెక్కును పాలవలస యశస్వినితో పాటు ఆమె అనుచరులు సారిక మురళీమోహన్, మోపాడ అనీల్, రామతోట రాజేష్ కాజేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాది కాలంగా పదవి లేదు సరికదా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని, మోసం చేశారని కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు.
సూరంపేటలో ఏనుగుల గుంపు
సీతానగరం: మండలంలోని సూరంపేట కేంద్రంగా 10 రోజులుగా మామిడి తోటల్లో 8 ఏనుగులు సంచరిస్తున్నాయి. సూరంపేట గ్రామానికి సమీపంలో ఉన్న జీడి మామిడి తోటలను స్థావరంగా చేసుకుని ఉన్న గజరాజులు అప్పయ్యపేట, గుచ్చిమి, తాన్నసీతారాంపురం గ్రామాల్లో తిరుగాడుతున్నాయి. జీడిమామిడి తోటల్లో కొమ్మలు విరగొట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


