రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పరారీలో కారు డ్రైవర్‌

బొండపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివా రం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై యు.మహేష్‌ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. గజపతినగరం మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన తిమినాని సత్యం (58) సైకిల్‌పై పాలు తీసుకుని (జాతీయ రహదారి 21పై ) గజపతినగరం వైపు వస్తుండగా.. బోడిసింగిపేట గ్రామం వద్దకు వచ్చేసరికి విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమా చారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థ లానికి చేరుకుని శవపంచనామ చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ యువతి..

గుమ్మలక్ష్మీపురం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి తోయక సత్యవతి (19) విజయనగరంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. లుంబేసు పంచాయతీ వాడబాయి గ్రామానికి చెందిన సత్యవతి తాడికొండ పంచాయతీ చాపరాయి జంగిడి భద్రలో ఈనెల 20న జరిగిన వివాహ వేడుకకు వెళ్లి.. పెండ్లి కుమార్తెను దిగబెట్టేందుకు పెండ్లి కుమార్తెతో పాటు ఆటోలో వెళ్తుండగా చాపరాయి – జండిగిభద్ర సమీపంలోని రెండో ఘాట్‌రోడ్డు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మండంగి జిలికి అక్కడికక్కడే మృతిచెందగా, మరో 11 మందకి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన తెలిసిందే. వారిలో తీవ్రంగా గాయపడ్డ సత్యవతిని మెరుగైన వైద్యం కోసం భద్రగిరి సీహెచ్‌సీకి అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యవతి కన్నుమూసింది. మృతురాలికి తల్లి ఆలమ్మ, తండ్రి గోపిలతో పాటు ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉన్నాడు. సత్యవతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు శనివారం మృతదేహాన్ని అప్పగించారు. సత్యవతి మృతితో వాడబాయి గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

జీవితం మీద విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

మక్కువ : జీవితం మీద విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కన్నంపేట గ్రామానికి చెందిన రాగల సతీష్‌ (32) శుక్రవారం రాత్రి మద్యం మత్తులో తన అనారోగ్యానికి సంబంధించి వాడుతున్న మాత్రలను అధిక మోతాదులో వేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి సతీష్‌ను బొబ్బిలి పట్టణంలోని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సతీష్‌ కొన్నాళ్లుగా లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంతకీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది అధిక మోతాదులో మందులు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement