గుర్ల: మండలంలోని సొలిపిసోమరాజుపేట ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణపై వచ్చిన ఆరోపణలపై గ్రామ సచివాలయం వద్ద ఉపాధి హమీ విజిలెన్స్ అధికారి వెంకటరమణ శనివారం విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభంలోనే గ్రామంలోని వేతనదారులు 400 మంది ఒక్కసారిగా సచివాలయం వద్దకు రావడంతో ఉద్రిక్త నెలకొంది. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్‌కు అనుకూలంగా, మరికొంత మంది వ్యతిరేకంగా వ్యవహరించడంతో తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై పి.నారాయణరావు సచివాలయం వద్దకు చేరుకుని ఇరువర్గాలను వేరుచేసి ప్రశాంత వాతావరణంలో విచారణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే పనుల్లో ఎటువంటి అవినీతి జరగకపోయినా టీడీపీ నాయకులు కావాలనే విచారణ పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విచారణలో ఏపీఓ రత్నమాల, ఉపాధి హమీ సిబ్బంది ఉన్నారు.
తోసుకున్న వేతనదారులు


