● లెండి కళాశాలలో స్మార్ట్ మైక్రోగ్రిడ్‌ల
భద్రతపై సదస్సులో నిపుణులు
● దేశ వ్యాప్తంగా పాల్గొన్న నిపుణులు, అధ్యాపకులు
డెంకాడ: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో విద్యుత్ వ్యవస్థల సురక్షిత నిర్వహణకు సైబర్ భద్రత ఎంతో కీలకమని లెండి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నిపుణులు స్పష్టం చేశారు. కళాశాలలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ సైబర్ అండ్ ఫిజికల్ సిస్టమ్, సైబర్ అండ్ సెక్యూరిటీ ఫర్ స్మార్ట్ మైక్రో అండ్ గ్రిడ్స్’ అనే అంశంపై ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ఆనన్‌లైన్ అధ్యాపక శిక్షణ కార్యక్రమం (ఎఫ్‌డీపీ) శనివారంతో విజయవంతంగా ముగిసింది. భవిష్యత్‌లో మేధోపరమైన, సురక్షిత విద్యుత్ వ్యవస్థల రూపకల్పనే ధ్యేయంగా ఈ సదస్సు సాగింది. ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సైబర్–ఫిజికల్ సిస్టమ్స్, స్మార్ట్ మైక్రోగ్రిడ్‌ల నిర్వహణ, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధారిత ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ కమ్యూనికేషన్, ఆధునిక విద్యుత్ వ్యవస్థల్లో ఎదురవుతున్న సైబర్ భద్రతా సవాళ్లు వంటి అత్యాధునిక అంశాలపై నిపుణులు ప్రత్యేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో లెండి కళాశాల అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


