న్యూస్‌రీల్
శోభాయమానంగా.. శిఖర ప్రతిష్ఠ
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026
మంత్రి ఇలాకాలో
మట్టి మాఫియా..!
మర్యాదపూర్వక కలయిక
విజయనగరం క్రైమ్: గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజును అశోక్ బంగ్లాలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పూలబొకేను అందజేశారు.
పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 1180 పల్స్‌పోలియో బూత్‌లు, 21 ట్రాన్సిట్ బృందాలు, 66 మొబైల్ బృందాలు, 2,360 ఇంటింటి సర్వే బృందాలు, 5068 మంది వ్యాక్సినేటర్లు, 129 మంది సూపర్ వైజర్లు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 2,273 మంది హైరిస్క్ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చూడాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో నివారణ చుక్కలు వేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ కె.రాణి, డీఐఓ రెడ్డి అచ్చుతకుమారి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఏసీబీ వలలో ఎం.కొత్తవలస వీఆర్వో
జామి/విజయనగరం క్రైమ్: జామి మండలం ఎం.కొత్తవలస వీఆర్వో కొత్తలి వీరన్న ఏసీబీ వలకు గురువారం చిక్కారు. భూమి మ్యుటేషన్ కోసం సునీత అనే మహిళా రైతు నుంచి రూ.14వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన జంకల సూర్యనారాయణ, సునీత దంపతులకు 21 సెంట్లు భూమి వారసత్వంగా వచ్చింది. రీ సర్వేలో 22సెంట్ల30 లింకులు నమోదైంది. సెంటు 30 లింకులను ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు వీఆర్వో రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని రైతు దంపతులు ప్రాథేయపడడంతో రూ.18000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.4వేలు తీసుకున్నారు. మిగిలిన సొమ్ము ఇచ్చుకోలేని రైతు కుంటుంబం ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని మహిళా రైతు సునీత నుంచి వీఆర్వో వీరన్న డబ్బులు తీసుకుని లెక్కపెడుతుండగా పట్టుకున్నారు.
హెచ్‌ఎం గదిలో నాగుపాము
వంగర: మండలంలోని అరసాడ జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని గదిలో గురువారం నాగుపాము కలకలం సృష్టించింది. హెచ్‌ఎం గదిలోని బీరువా కింద ఉన్న పామును చూసి హెచ్‌ఎం ఖండాపు జగదీశ్వరితో పాటు ఉపాధ్యాయులు ఉలిక్కిపడ్డారు. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పాఠశాలకు చేరుకుని పామును పట్టుకొని సమీప తోటల్లో విడిచిపెట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
విజయనగరం గంటస్తంభం:
అధికార బలంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటోంది. వచ్చిన సొమ్మును వాటాలు వేస్తూ.. సహజవనరులను కొల్లగొడుతోంది. మాఫియా దాటికి కొండలు తరగిపోతున్నాయి. నదీ తీరాలు గోతులమయంగా మారుతున్నాయి. చెరువు గర్భాలు రూపం కోల్పోతున్నాయి. గంట్యాడ మండలం పెదవేమలి రాతి చెరువులో సాగుతున్న మట్టి అక్రమతవ్వకాలే దీనికి నిలువెత్తు నిదర్శనం. రాత్రీ పగలు తేడాలేకుండా వారం రోజులుగా యంత్రాలతో మట్టితవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లతో తరలిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార బలంతో స్థానిక నేతలు యథేచ్ఛగా చెరువు గర్భాన్ని గుల్లచేస్తున్నారు. ప్రశ్నించిన కిందిస్థాయి సిబ్బందికి మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నట్టు సమాచారం.
● ఆందోళనలో రైతులు
రాతి చెరువులో మట్టితవ్వకాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇష్టారాజ్యంగా చెరువు గర్భాన్ని తవ్వేస్తే ఆయకట్టుకు సాగునీరు అందదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మట్టి తవ్వకాలను నిలిపివేయాలంటూ కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్లు, యంత్రాల నంబర్లు, తవ్వకాల ఫొటోలతో కూడిన ఆధారాలు సమర్పించారు. కలెక్టర్ స్పందించి తవ్వకాలను పరిశీలించాలని ఆదేశాలిచ్చినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనికి అధికార పార్టీ నేత ఒత్తిడే కారణమని ఆరోపిస్తున్నారు. మట్టితవ్వకాలతో వచ్చిన సొమ్ములో వాటా వెళ్తుండడంతో పైస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా తన పదవిని అడ్డుపెడుతున్నట్టు సమాచారం. కలెక్టర్, విజిలెన్స్ అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.
విజయనగరం టౌన్: సిరుల తల్లి సాక్షాత్కరించింది. అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. జై పైడిమాంబ నినాదాలతో చదురుగుడి ప్రాంతమంతా భక్తిభావం నెలకొంది. శిఖరప్రతిష్ఠ మహోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల దేవస్ధానం ఆగమ పాఠశాల శైవాగమ పండితులు కాళ్లకూరి సుబ్రహ్మణ్యశర్మ నేతృత్వంలో వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో సంప్రదాయరీతిలో క్రతువు పూర్తిచేశారు. అనంతరం సాధారణ భక్తులకు మధ్యాహ్నం నుంచి అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. విస్తరణ పనులు విజయవంతంగా పూర్తిచేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఆలయ విస్తరణ పనులు పూర్తిచేయడం అభినందనీయమన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీగజపతిరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ఆలయం వద్దనున్న ఖాళీస్థలంలో భక్తులకు అవసరమైన వసతులను కల్పించనున్నామని చెప్పారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
● కనుల పండువగా మహోత్సవం
అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం కనులపండుగగా జరిగింది. పూసపాటి వంశీయులు శిఖరంపై ప్రతిష్ఠించిన కలశాలకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు శిఖరంపై ఉన్న కలశాలను దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో భక్తులు కలశాలను తాకి తన్మయత్వం చెందారు. కలశంపై వేసిన బూరెలను తీసుకునేందుకు బారులు తీరారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు.
రామభద్రపురం:
పాఠశాలలు ఆరంభమై పక్షం రోజులైనా పిల్లలకు విద్యామిత్ర కిట్‌లు పూర్తిస్థాయిలో అందలేదు. కాళ్లకు ష్యూస్ లేకుండా, పాతవి, చిరిగిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకుని తరగతులకు హాజరవుతున్నారు. మరోవైపు డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజన పథకంలో విద్యార్థులకు శనగ చిక్కీలు ఇవ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1766 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం అమలు చేసిన మెనూ ప్రకారం రోజూ వండి పెడుతున్న మధ్యాహ్నభోజనంతో పాటు సోమవారం, బుధవారం, శుక్రవారాలు వేరుశనగ చిక్కీ, మంగళవారం, గురువారం, శనివారాలు రాగిజావ ఇవ్వాల్సి ఉంది. పాఠశాలలు పునఃప్రారంభం నుంచి ఇప్పటి వరకు వేరుశనగ చిక్కీలు ఏ పాఠశాలలోనూ ఇవ్వలేదు. రాగి జావ కొన్ని పాఠశాలల విద్యార్థులకే పరిమితమైంది. పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పేద కుటుంబాలు చదువుతున్న పాఠశాలలపై శ్రద్ధ కరువైందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏ పాఠశాలకు వెళ్లినా పిల్లలు ఏమని అడుగుతాం..వేరుశనగ చిక్కీ లు ఒక్కరోజు కూడా ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని రామభద్రపురం ఎంఈవో తిరుమలప్రసాద్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా శనగ చిక్కీలు పాఠశాలలకు రాలేదన్నారు. ఉన్నతాదికారుల దృష్టిలో పెట్టామని, రాగిజావను మెనూ ప్రకారం పిల్లలందరకూ వడ్డించాలని, లేదంటే ఆయా పాఠశాలల హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటామన్నారు.
కొట్టక్కి మోడల్ ప్రాథమిక పాఠశాలలో శనగ చిక్కీలేని మధ్యాహ్నభోజనం తింటున్న విద్యార్థులు
కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో ‘నిషాముక్త్ భారత్ సప్తాహ్’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి జెండా ఊపి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాను మత్తురహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గతంలో 50 శాతంగా ఉన్న జిల్లా అక్షరాస్యత ప్రస్తుతం 86 శాతానికి చేరిందని, విద్యాపరంగా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోందని వివరించారు. ఈ క్రమంలో యువత గంజాయి తదితర మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల అక్రమరవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని.. డ్రగ్స్‌కు బానిస కాబోమంటూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు.
భక్తిశ్రద్ధలతో పైడితల్లి ఆలయ
పునఃప్రారంభం
తొలిపూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు
మధ్యాహ్నం నుంచి సాధారణ
భక్తులకు దర్శనభాగ్యం
గంట్యాడ మండలం రాతిచెరువులో
మట్టి అక్రమ తవ్వకాలు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేసినా
ఆగని మట్టి దందా
మాఫియా వెనుక కీలకనేత అండదండలు
ఆందోళనకు సిద్ధమవుతున్న పెదవేమలి గ్రామస్తులు
అనుమతులు లేవు... చర్యలు తీసుకుంటాం...
పెదవేమలి రాతి చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. పర్మిషన్ లేకుండా చెరువుల్లో తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధం. మా శాఖ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై, అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆదేశాలతో తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పిస్తాం.
– కె.శంకర్, ఇరిగేషన్ జేఈ,
గంట్యాడ మండలం
మంత్రి పేరు చెప్పి దోచేస్తున్నారు...
పెదవేమలి రాతి చెరువులో వారం రోజులుగా రాత్రీపగలూ తేడా లేకుండా పొక్లెయిన్‌తో మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. స్థానిక టీడీపీ నాయకులు మంత్రి పేరు చెప్పుకుని ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపై అన్ని ఆధారాలతో కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు పర్యవేక్షించలేదు. ఇది మంత్రి సొంత మండలం కావడంతో అధికారులు పూర్తిగా ఒత్తిళ్లకు లొంగిపోయారు. ఉన్నతాధికారులు రైతుల ఆవేదనను అర్థం చేసుకుని తవ్వకాలను అడ్డుకోవాలి. – వర్రి పాపునాయుడు, మాజీ సర్పంచ్, పెదవేమలి
పాఠశాలల పిల్లలకు అందని
శనగ చిక్కీలు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో అరకొర భోజనం
సర్కారు తీరుపై మండిపడుతున్న
విద్యార్థుల తల్లిదండ్రులు
ఎల్‌నినోపై అవగాహన అవసరం
పార్వతీపురం: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, నేలలో తేమ తగ్గే అవకాశం ఉందని, రైతు లు ముందస్తు ప్రణాళికలతో పంటలు సాగుచేయా లని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. కలె క్టరేట్‌లో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబురావునాయుడుతో కలిసి ఎల్‌నినో అవగాహన కరపత్రాలను గురువారం విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని, పశుగ్రాసం కొరత ఏర్పడవచ్చన్నారు. ప్రకృతి వ్యవ సాయ పద్ధతులు, దేశీ విత్తనాలతో బహుళ పంటల సాగు, తక్కువ నీటితో పంటల సాగు, పశుగ్రాస ఉత్పత్తి వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు అవగాహన కరపత్రాల్లోని సూచనలు పాటించి నష్టాలను నివారించుకోవాలన్నారు.
‘మార్ట్’తో మార్పు..
గిరిజన రైతాంగాన్ని సుసంపన్నం చేయడమే లక్ష్యంగా 2026–31 కాలానికి మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్(మార్ట్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో మార్ట్ ప్లాగ్‌షిప్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లా డారు. థాయ్‌లాండ్ తరహా ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మిరియాలు వంటి అంతర పంటల సాగు, గట్టు మీద చెట్టు వంటి వినూత్న కార్యక్రమాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అధికారులకు సూచించారు.


