ఏకగ్రీవంగా విశ్రాంత ఉద్యోగుల సంఘ జిల్లా కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవంగా విశ్రాంత ఉద్యోగుల సంఘ జిల్లా కార్యవర్గం

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

బొబ్బిలి: బొబ్బిలిలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో బుధవారం విశ్రాంత ప్రభు త్వ ఉద్యోగుల సంఘం జిల్లాశాఖ ఎన్నికలు నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రౌతు రామమూర్తినాయుడు, రెడ్డి కృష్ణమూర్తి నాయుడు ఎన్నికయ్యారు. అసోసియేట్‌ అధ్యక్షులుగా లచ్చుపతుని జగన్నాథం, పోల సత్యంనాయుడు, ఉపాధ్యక్షులుగా ఎ.వెంకటనాయుడు, బి.కృష్ణమ్మ, ఎం.సుధాకరరావు, ఆర్‌.నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. మరో నలుగురు కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు.

రూ.60 కోట్లతో పవర్‌ ప్లాంట్‌

బొబ్బిలి: మండలంలోని నారాయణప్పవలస, కాశిందొరవలస మధ్యలో సుమారు రూ.60 కోట్లతో 18 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌ను నిర్మించనున్నట్టు ఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) టీవీ సూర్యప్రకాష్‌ తెలిపారు. ప్టాంట్‌ నిర్మాణ స్థలాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. 55 ఎకరాల స్థలంలో ప్లాంట్‌ను నిర్మిస్తామన్నారు. పవర్‌ప్లాంట్‌ నిర్మాణం వల్ల బొబ్బిలి ప్రాంత విద్యుత్‌ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు వీలుకలుగుతుందన్నారు. అనంతరం ఆయన ఈఈ కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ లక్ష్మణరావు, ఈఈ బి.రఘు, ఏడీఈలు శ్రీనివాస్‌, భానునాయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement