ఏఎన్‌ఎంలకు కలిసొచ్చిన జీఎన్‌ఎం శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌ఎంలకు కలిసొచ్చిన జీఎన్‌ఎం శిక్షణ

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

గత ప్రభుత్వ నిర్ణయంతో ఏఎన్‌ఎంలకు లబ్ధి

జీఎన్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

విజయనగరం ఫోర్ట్‌:

వైద్యారోగ్యశాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు గొప్ప మనసుతో గత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు లబ్ధి చేకూర్చింది. జీఎన్‌ఎం శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి ఉన్న ఏఎన్‌ఎంలకు రెండేళ్ల పాటు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శిక్షణ ఇప్పించారు. జిల్లాలో 88 మంది 2022 నుంచి 2024 మార్చి నెలఖారు వరకు శిక్షణ పొందారు. వీరిలో 38 మందికి జీఎఎన్‌ఎంలుగా నియామక ఉత్తర్వులు వచ్చాయి. వీరిలో 30 మంది జీఎంఎన్‌ఎంలుగా మూమెంట్‌ ఆర్డర్స్‌ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి బుధవారం వచ్చారు. అధికారులు వారికి మూమెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వడంతో కేజీహెచ్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో జీఎన్‌ఎంలుగా చేరారు. గత ప్రభుత్వం ఇప్పించిన శిక్షణ అవకాశం వల్లే తమకు ఉద్యోగోన్నతి లభించిందంటూ సంతోషం వ్యక్తంచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement