● హాస్టళ్లు, స్కూళ్లలో సదుపాయాలేవి? | - | Sakshi
Sakshi News home page

● హాస్టళ్లు, స్కూళ్లలో సదుపాయాలేవి?

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రెవల్యూషనరీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్మి శాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంలో కనీస నాణ్యత లేదని, విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న వేలాది టీచర్‌, లెక్చరర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement