జిల్లాలోని 11 ఎంఎల్‌ఎస్ పాయింట్లలో దాదాపు 40 ఏళ్లుగా పనిచేస్తున్నాం... పాత అగ్రిమెంట్ గడువు ముగిసినా, కొత్త కూలిరేట్ల ప్రకారం ఒప్పందం చేయకపోవడం దుర్మార్గం... 300 మంది హమాలీల బతుకులు అగమ్యగోచరంగా మారాయి.. కూలి బతులకుపై అంత అక్కసు ఎందుకంటూ ఏపీ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. యూనియన్ నాయకులు ముల్లు నర్సింహులు, కండిపల్లి భీముడు, పి.కామేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతినెలా 10వ తేదీలోపు బిల్లులు చెల్లించాలని, స్టేజ్–2లో సరుకులు బట్వాడా చేయాలని, అన్లోడింగ్ చార్జీలు నేరుగా అకౌంట్లలో వేయాలని, చనిపోయిన, విశ్రాంత పొందిన కలాసీలకు పీఎఫ్ వెంటేనే చెల్లించాలని డిమాండ్ చేశారు.


