● డీఎస్సీ–2025లో పారదర్శకత ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

● డీఎస్సీ–2025లో పారదర్శకత ఎక్కడ?

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్మకతను తిలోదకాలిచ్చిందని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) మండిపడింది. పార్టీ రాష్ట్ర కార్యదర్మి సోమ రాంబాబు, జిల్లా అధ్యక్షులు బొచ్చ బుద్దుడు మాస్టారు ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్మి గాలి చైతన్యకుమార్‌ మాట్లాడుతూ కేటగిరీ వైజ్‌ కటాఫ్‌ మార్కులు, పూర్తి మెరిట్‌ లిస్ట్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టకుండా దాచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, సంఖ్యలతో ప్రచారం చేసుకోవడం ఆపి, నిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement