కొత్తవలస: నిత్యం జనసంచారం కలిగిన కొత్తవలస జంక్షన్‌లో దొంగలు పేట్రేగి పోయి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొత్తవలస జంక్షన్ నుంచి విజయనగరం రోడ్డులో గల విన్నకోటి దేదీప్య బియ్యం, నూకలు షాపులో శనివారం రాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో దొంగలు షట్టర్ల తాళాలు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో షాపు యజమాని విన్నకోటి గౌతం సోమవారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చి చూడగా షట్టర్ విరగ్గొట్టి, తాళాలు కట్ చేసిన ఉన్నట్లు గుర్తించారు. వెంటనే షాపులోకి వెళ్లి చూడగా కౌంటర్‌లో గల రూ 20వేలు నగదు, కొన్ని బియ్యం బస్తాలు దోచుకుపోయినట్లు గుర్తించాడు. షాపు బయట, లోపల గల సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్‌లో ఉంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


