ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి వీఐటీలో ఉచిత సీటు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి వీఐటీలో ఉచిత సీటు

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

నెల్లిమర్ల: స్థానిక సీకేఎం ప్రభుత్వ జూనియర్‌ కళా శాల విద్యార్థిని షేక్‌ షేరున్నిసా ప్రతిష్టాత్మక అమరావతి వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 100% ఉచిత ఇంజినీరింగ్‌ సీటు సాధించి రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఆమె 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. దీంతో వీఐటీ సంస్థ గ్రామీణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ’స్టార్స్‌’ పథకం కింద ఆమెకు ఈ ఉచిత సీటును కేటాయించారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ ట్యూషన్‌ ఫీజుతో పాటు హాస్టల్‌, భోజన వసతి ఖర్చులను కూడా వీఐటీ సంస్థే పూర్తిగా భరించనుంది. కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ఉచిత సీటు సాధించిన షేరున్నిసాను, ఆమె తల్లిదండ్రులను కళాశా ల ప్రిన్సిపాల్‌ మజ్జి సత్యనారాయణ, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.

6.5కేజీల గంజాయి పట్టివేత

విజయనగరం క్రైమ్‌: స్థానిక రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్‌లు సోమవారం తనిఖీ నిర్వహిస్తుండగా సుమారు రూ.3లక్షల 25వేల విలువ గల 6.5కేజీల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీలో తమిళనాడు రాష్ట్రం టెంకశి జిల్లాకు చెందిన శంకలి పండా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం బ్రహ్మపుర నుంచి సొంత గ్రామానికి గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డాడని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు అనంతరం అరెస్ట్‌ చేసి విశాఖ రైల్వే కోర్టు కు తరలించామని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement