అడవి బిడ్డలం.. అక్షర జ్ఞానం కల్పించండి | - | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డలం.. అక్షర జ్ఞానం కల్పించండి

Jun 22 2026 12:12 AM | Updated on Jun 22 2026 12:12 AM

అడవి బిడ్డలం.. అక్షర జ్ఞానం కల్పించండి నేడు పీజీఆర్‌ఎస్‌ పాఠశాలల్లో సూర్య నమస్కారాలు

శృంగవరపుకోట: ‘అడవి బిడ్డలమైన మాకు అక్షర జ్ఞానం కల్పించండి’ అంటూ మండలంలోని దారపర్తి పంచాయతీ కురిడి గ్రామానికి చెందిన విద్యార్థులు కలెక్టర్‌ను వేడుకున్నారు. గిరిశిఖర గ్రామమైన కురిడిలో 100 కుటుంబాలు ఉండగా 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరంతా గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నిత్యం ఆరు కిలోమీటర్లు కొండలు, గుట్టలు, వాగులు దాటి గూనపాడు గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్నారు. నిత్యం అంత దూరం నడవలేక వారంలో రెండు మూడు రోజులు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. మా పిల్లల విద్యాభ్యాసానికి వీలుగా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయండి లేదా మాస్టర్‌ను పంపి తమ బిడ్డలకు అక్షరాలైనా నేర్పించండి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. విద్యా ర్థుల వెతలను గుర్తించిన గిరిజన సంఘం నేత జె.గౌరీష్‌ దీన్ని వీడియో చేసి కలెక్టర్‌ను వేడుకుంటున్న దృశ్యాలను కలెక్టర్‌కు, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం ప్రతినిధులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.

విజయనగరం అర్బన్‌: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవా రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్య ల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ వంటి పూర్తి వివరా లను స్పష్టంగా నమోదు చేయాలని, సమస్య కు సంబంధించిన ఆధారాలను జత పరచాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావా లని తెలిపారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా లేదా ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సోమవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘రెవెన్యూ క్లినిక్‌’ నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసిన తొలి జిల్లాగా పార్వతీపురం మన్యం రికార్డు సృష్టించిందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆయుష్‌ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదా నంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్స వం ఆదివారం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement