మెరకముడిదాం: మండలంలోని చినబంటుపల్లి పంచాయతీ మధుర గ్రామమైన సింగవరం గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనధికారికంగా విత్తనాలు, ఎరువులు విక్రయాలు జరుపుతున్న తాల్లపూరి అప్పలనాయుడుకు చెందిన దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఎస్‌ఐ రామారావు, ఏఓ ఎం.అనురాధతో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.3 లక్షల విలువ చేసే ఎంటీయూ 1121 విత్తనాలు 35 బ్యాగులు, మొక్కజొన్న విత్తనాలు 96 ప్యాకెట్లు, సుమారు రూ.70 వేల విలువ చేసే 20 – 20 – 0 – 13 కోరమండల్ ఎరువుల బస్తాలు 48 స్టాకు ఉన్నట్టు గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాపు నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. దాడుల్లో వ్యవసాయ విస్తరణ అధికారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
సుమారు రూ.3లక్షల విలువైన
విత్తనాలు, రూ.72 వేల విలువైన
ఎరువులు సీజ్
విత్తనాలు, ఎరువులను స్వాధీనం
చేసుకున్న అధికారులు


