ఈ చిత్రం చూశారా... నెల్లిమర్ల మండలం సతివాడలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల చెక్కు పంపిణీ కార్యక్రమం. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి కార్యక్రమానికి హాజరవుతారని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. చివరికి ఆమె స్థానంలో ఏ అర్హత లేని ఆమె భర్త లోకం ప్రసాద్ హాజరై అన్నీ తానై వ్యవహరించారు. ఆయన తీరును చూసి అక్కడి అధికారులు నివ్వెరపోయారు. టీడీపీ నేత, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గేదెల గాయత్రి వ్యవసాయశాఖ కీల పదవుల్లో ఉంటూ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. – నెల్లిమర్ల రూరల్


