శృంగవరపుకోట: మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధి కురిడి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీ కష్టాలు వీడడం లేదు. గ్రామానికి చెందిన సర్వేల సన్యాసిరావు (35) అనే గిరిజనుడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో శనివారం ఉదయం గ్రామస్తులు డోలీలో 10 కిలోమీటర్ల మేర మోసుకుంటూ మెట్టపాలెం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి తరలించారు. ‘అడవి తల్లి బాట’ పథకం కింద గిరిజన ఆవాసాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వాల ప్రకటనలు చేయడం తప్ప గిరిజనానికి ఒరిగేదేమీ లేదని, ఇప్పటికై నా కూటమి పాలకులు కళ్లు తెరిచి తమ కష్టాలు చూడాలంటూ గిరిజనులు కోరుతున్నారు.


