విజయనగరం అర్బన్: ౖనెరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న తరుణంలో వర్షాలు, వరదల వల్ల తలెత్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహ ణ శాఖ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో వీడియా కాన్ఫరెన్స్‌లో శుక్రవారం మాట్లాడా రు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ లు, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్ని మాపక, విద్యాశాఖలతోపాటు అన్ని అనుబంధ శాఖలు విపత్తు నిర్వహణపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, ఉద్యానవన శాఖ అధికారి కె.చిట్టిబాబు, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం: జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో కొత్తగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్‌గా ఎన్నికై న కంది వెంకటరమణ..జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్‌క్రాస్ నూతన చైర్మన్ సహా కొత్తగా ఎన్నికై న సభ్యులను జెడ్పీ చైర్మన్ దుశ్శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. జిల్లాలో రక్త నిల్వలు పెంచేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, రక్తదానంపై ప్రజలకు ఉన్న అపోహలు పోగొట్టి, ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ కోశాధికారి పొగిరి విశ్వేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు వెన్నెల చంద్రశేఖర్, ముమ్మల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ
పాలకొండ రూరల్: విజయవాడ నుంచి పాలకొండ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఉట్టిగుట్ట నాగేశ్వరరావు తన బ్యాగ్‌ను మరిచిపోయి విశాఖపట్నంలో దిగిపోయాడు. బ్యాగ్ గమనించిన డ్రైవర్లు పాలకొండ డిపోలో అందించారు. బ్యాగ్‌లో లక్ష రూపాయల నగదుతోపాటు వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లు డిపో యాజమాన్యం గుర్తించింది. వెంటనే సెల్ ఫోన్‌లో బాధితులకు డిపో మేనేజర్ బీఎస్‌ఎన్‌మూర్తి సమాచారం అందించారు. నాగేశ్వరరావు కుమార్తె జ్యోతి శుక్రవారం పాలకొండ డిపోకు చేరుకోవడంతో ఆర్టీసీ యాజమాన్యం బ్యాగ్‌తోపాటు మిగిలిన వస్తువులను అందజేసింది. విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్న డ్రైవర్లు బంగారునాయుడు, రమేష్‌లను యాజమాన్యం అభినందించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో పాటు వస్తులకు కూడా భద్రత ఉంటుంద న్నారు.


