చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

23 తులాల బంగారం, 73తులాల వెండి స్వాధీనం

విజయనగరం క్రైమ్‌: గత నెల 30వ తేదీన విజయనగరం టూటౌన్‌ పరిధి వైఎస్‌ఆర్‌ నగర్‌లోని శ్రీసత్య నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో విశాఖ జిల్లా మధురవాడకు చెందిన షేక్‌ అజీజ్‌ ను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసు అంశాలను ఎస్పీ దామోదర్‌ వెల్లడించారు. మధుర వాడకు చెందిన షేక్‌ అజీజ్‌ ఇప్పటివరకు పలు జిల్లాల్లో 50 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో గత నెల 30న పొట్టా వీర వెంకట స్వామి తన భార్యతో అన్నవరం దర్శనం చేసుకుని మర్నాడు 31 వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం తెరిచి ఉంది. ఇంటి లోపల అన్ని తలుపుల గడియలు తీసి ఉండడం ఆపై బెడ్‌ రూమ్‌ లో బీరువా లాకర్‌ తెరిచి ఉండటం మంచంపై బీరువాలో సామగ్రి పడి ఉండడం లాకర్‌లో 23న్నర తులాల బంగారం, 73 తులాల వెండి వస్తువులు కనిపించకపోవడంతో లబోదిబో మంటూ ఆ రోజు రాత్రి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. జరిగిన దొంగతనాన్ని సీరియస్‌ గా తీసుకున్న ఎస్పీ దామోదర్‌ పది క్రైమ్‌ బృందాలను రంగంలోకి దించారు. పోలీసులకు అందిన సమాచారంతో నిందితుడు షేక్‌ ఆజీజ్‌ కాకినాడలో ఉండడంతో వారంట్‌ తీసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌ నిందితుడు షేక్‌ ఆజీజ్‌ ను తమదైన శైలిలో విచారణ చేసి చోరీ కేసులో పోయిన ఆభరణాలను,నగదును రికవరీ చేశారని ఎస్పీ వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement