జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు శుక్రవారం ప్రారంభమైనా విద్యార్థులకు కిట్‌లు మాత్రం అందలేదు. కొందరు విద్యార్థులు కాళ్లకు షూస్‌లేకుండా, చిరిగిన బ్యాగులు, దుస్తులతోనే తొలిరోజు పాఠశాలలకు హాజరయ్యారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే ‘జగనన్న విద్యా కానుక’ కింద యూనిఫారాలు, షూస్, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర సామగ్రిని విద్యార్థులకు అందజేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,11,700 మంది విద్యార్థులకు ‘స్టూడెంట్ కిట్’లు అందజేయాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
– విజయనగరం అర్బన్


