వీరఘట్టం: మండలలలోని హుస్సేనుపురం పంచాయతీ పరిధిలోని నీలంపేట సమీపంలో పొలాల్లో శుక్రవారం సాయంత్రం పిడుగు పడడంతో అక్కడ ఉన్న 10 గొర్రెలు, 21 మేకలు మృతి చెందాయి. హుస్సేనుపురం గ్రామానికి చెందిన చిన్ని చిట్టిబాబు, గణపతి, దుర్గారావు పంట పొలంలో మందవేశారు. ఇంతలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.5 లక్షల నష్టం ఉంటుందని బాధితులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.


